24-07-2025 12:40:14 AM
మహబూబ్ నగర్, జూలై 23 (విజయక్రాంతి): ’నా రూటే వేరు.. సినిమాలో హీ రో పలికే డైలాగులు.. అక్షరాల ఆ ఎమ్మెల్యేకు సరిపోతాయి.. ఆ ఎమ్మెల్యే ఎవ రో..!? ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లా వాసులకే కాదు.. రాష్ట్రంలో రాజకీయ పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది.. అతనే .. మహబూబ్ నగర జిల్లా జడ్చర్ల అ సెంబ్లీ నియోజకవర్గ అధికార పార్టీ ఎమ్మె ల్యే అనిరుద్ రెడ్డి. ఆయన ఎమ్మెల్యేగా గెలిచింది మొదలు..
ఇప్పటిదాకా చేసిన.. చేస్తు న్న వ్యాఖ్యానాలు రాజకీయ వర్గాలలోనే కా దు.. సాధారణ జనంలోనూ ఆసక్తిని రేపుతున్నాయి. ఆయన చేసే వ్యాఖ్యానాలలో మొదట్లో నిజాయితీ కనిపించిన.. రాను రా ను ఆ నిజాయితీ లోపించడం..
పలువురు సామాజిక మాధ్యమాలలో చేసే వ్యాఖ్యానా లు అన్ని నీ కావు.. ఎమ్మెల్యేగా గెలిచిన మొ దట్లో నాకు సెక్యూరిటీ అవసరం లేదు.. నేను సాధారణ మనిషిగా జనాలలోకి వెళ్లి సమస్యలు పరిష్కరిస్తాను అని చెప్పాడు.. కానీ అది అమలుకు నోచుకోలేదు.. సెక్యూరిటీ యధావిధిగా కొనసాగుతుంది.
బెల్ట్ షాపుల సమాచారం ఇస్తే రూ 10 వేలు ఇస్తా
నా నియోజకవర్గంలో ఎక్కడ కూడా బె ల్టు షాపులు ఉండడానికి వీలు లేదు. బెల్టు షాపులు ఎక్కడ ఉన్న సమాచారం అందించిన వారికి పదివేల రూపాయల నగదు బ హుమతి ఇస్తాను అని మీడియా సమావేశం లో ప్రకటించాడు. కానీ నియోజకవర్గంలో బెల్ట్ షాపులు యధావిధిగా కొనసాగుతున్నాయి.
తిరుపతి వెంకన్న దర్శనానికి వెళ్లి తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యే ల సి ఫారసు లేఖలకు విలువ లేకపోవడంపై మీ డియా సమావేశంలో చేసిన విమర్శలు రెం డు తెలుగు రాష్ట్రాలలో చర్చనీ అంశం అ య్యాయి. ఆ తర్వాతనే తెలంగాణ రాష్ట్ర మం త్రులు, ఎమ్మెల్యేల సిఫారసు లేఖలకు తిరుమలలో అనుమతి లభించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పోలేపల్లి ఫార్మా కంపెనీ నుండి కాలుష్యం వెదజల్లుతూ పలు గ్రామాల చెరువులు కలుషిత మవుతున్నాయి.. ఆ కలుషిత నీటిని అదు పు చేయకుంటే ఆ కంపెనీని కాల్చివేస్తానని ఘాటుగా వ్యాఖ్యానించారు. కంపెనీ పరిస్థితిల్లో పెద్దగా మార్పులు రాలేదు. బాలనగర్ లో వాతావరణ కాలుష్యం ఆరోపణలతో ఐరన్ కంపెనీలను మూయించారు.
రాజాపూర్ మండలంలో చెరువుల భూ ములను మట్టితోవ్వడంతో పాటు.. పెద్ద ఎ త్తున చెరువు భూములను ఆక్రమించారు అ ని వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. చివరకు ఫైన్ వేయించారు. బాలనగర్ మండలంలో ప్రతిపక్ష పార్టీల నాయకుల భూ దండాలకు రాష్ట్ర మంత్రి సహకరిస్తున్నారని బాహాటంగా చే సిన విమర్శలు అధికార పార్టీలో దుమారం రేపాయి.
ప్రతిపక్ష పార్టీల నాయకుల అవినీతిపై పలు సందర్భాలలో విమర్శలు చేశారు. ఇలా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసే వ్యాఖ్యానాలు మీడియా కథనాలకు ఉపయోగపడుతున్న.. ప్రజలకు ఆశించిన స్థా యిలో ప్రయోజనం ఉండడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. క్రమక్రమంగా ఆయన వ్యాఖ్యానాలను గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అన్న పరిస్థితులు నెలకొంటున్నాయి.
సొంత పార్టీ నేతలపై ఆరోపణలు..
ఉదండాపూర్ లో ఊర్లో లేని వారికి అ ప్పటి అధికార పార్టీ నాయకులు వారి బం ధువులకు కూడా భూమి ఉన్నట్లు రికార్డు లు సృష్టించి ప్రాజెక్టు పరిహారం పొందాల ని వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని అ సెంబ్లీలో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి సీఎం కు వ్యతిరేకంగా రహస్య సమావేశం నిర్వహిం చి రాష్ట్ర వ్యాప్తంగా సంచలన ఊహాగానుల కు తెరలేపారు.
ఓ భూమి మీద వివాదంలో అక్రమాలు జరిగాయని సాక్షాలతో సహా రాష్ట్ర మంత్రి పొంగులేటి కి ఫిర్యాదు చేసి నా కూడా అక్రమార్కులకే మంత్రి మద్దతు పలికారని తాను ప్రభుత్వంలో ఉన్నానా ప్ర తిపక్షంలో ఉన్నానా అని సొంత పార్టీ మం త్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు పోవట్టులకే పనులు హాట్ టాపిక్..
ఇటీవల కాంట్రాక్టర్లందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సీఎం చంద్రబాబు నాయుడు కోవర్టులే ఇక్కడ కాంట్రాక్టర్లుగా పని చేస్తున్నారని ఇటీవల ప్రత్యేక ఆరోపణలు ఎమ్మె ల్యే అనిరుద్ రెడ్డి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశం చర్చినీ అంశంగా మారింది. తెలంగాణ వచ్చాక కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లు పనిచేస్తే ఎలా అంటూ అసహనం వ్య క్తం చేశారు.
ఈ తరుణంలో జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే సైతం ముందుగా జడ్చర్ల నియోజకవర్గంలో పనిచేస్తున్న ఆంధ్ర కాంట్రాక్టర్లకు నిలిపివేయాలం టూ సవాలు కూడా చేయడం జరిగింది. ఇలా సవాళ్లకు ప్రతి సవాళ్లకు సమయం గడుస్తుంది తప్ప అభివృద్ధి మాత్రం అంతంత మాత్రమే ఉందని జడ్చర్ల నియోజకవర్గం ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆరోపణలు కాదు అభివృద్ధి కావాలి..
జడ్చర్ల ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి ఆరోపణలు చేయడంలో రాష్ట్రంలోనే మొద టి స్థానంలో నిలిచారని జడ్చర్ల వాసు లే చెబుతున్నారు. ఆరోపణలు కాదు అభివృ ద్ధి కావాలంటూ చర్చల నియోజకవర్గ ప్రజ లు ప్రత్యేకంగా కోరుతున్నారు. ఒక్కటి కా దు రెండు కాదు మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పై పలు ఆరోపణలు చేసినప్పటికీ మాజీ ఎ మ్మెల్యే లక్ష్మారెడ్డి సైతం వివిధ ఆరోపణలు ఎమ్మెల్యే పై కూడా చేయడం జరిగింది.
వింటున్నంతసేపు ఇది నిజమే కదా..?
అనుకుంటున్న జనానికి మరో ఒకరు మాట్లాడితే అది నిజమే కదా.? అనేలా ఇరువురు ఆరోపణలు ఉన్నాయి. జడ్చర్ల అభివృద్ధి విషయంలో మాత్రం ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆశించిన మేరకు చేయడం లేదనే ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి లో గతంలో ఇచ్చిన హామీల మేరకు చేస్తే చాలంటూ జడ్చర్ల వాసులు కోరుతున్నారు.