calender_icon.png 23 May, 2025 | 5:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతి పైలెట్ ప్రాజెక్టు కింద 4,100 దరఖాస్తుల సర్వే

23-05-2025 12:46:01 AM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్     

కామారెడ్డి, మే 22(విజయ క్రాంతి): భూ భారతి సర్వే పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం లింగం పేట్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతి సర్వే డెస్క్ పనులను ఆయన సబ్ కలెక్టర్ తో కలిసి పరిశీలించారు.

భూ భారతి పైలెట్ ప్రాజెక్ట్ కింద మండలంలోని 25 గ్రామాల్లో రైతు సదస్సులు నిర్వహించడం జరిగిందని తెలిపారు, భూభారతి సదస్సులలో పలు సమస్యలకు సంబంధించి 4,225 దరఖాస్తులు రాగా  సదస్సులలో వచ్చిన దరఖాస్తులను రెవిన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి  4100 దరఖాస్తులను  సర్వే చేయడం జరిగిందని తెలిపారు.

డెస్క్ వర్క్ ను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఎల్లారెడ్డి ఆర్డీఓ మన్నే ప్రభాకర్, తహసీల్దార్ సురేష్, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు