calender_icon.png 9 November, 2025 | 5:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘కాటేదాన్ దక్కన్ శబరి పీఠం నుంచి శబరిమలకు సువర్ణ భూమి మహా పాదయత్ర ప్రారంభం

08-11-2025 12:00:00 AM

వేముల వెంకటేష్ నారికేళ గురుస్వామి వెల్లడి

రాజేంద్రనగర్, నవంబర్ 7 (విజయక్రాంతి ):  దక్కన్ శబరి పీఠంగా భావించే కాటేదాన్ మణికంఠ హిల్స్ లోని శ్రీ అయ్యప్ప దేవాలయం నుంచి కేరళలోని శబరిమలకు సువర్ణభూమి మహా పాదయాత్ర ఈ నెల 8వ తేదీన ప్రారంభం అవుతుందని ఆలయ ఫౌండర్ సభ్యలు వేముల వెంకటేష్ గురుస్వామి తెలిపారు. తాను 18వ సంవత్సరం అయ్యప్ప మాలాధారణ చేసిన శుభ సందర్భంగా నారికేళ గురుస్వామిగా ఈ నెల 11వ తేదీన మహాపడి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఆదివారం కాటేదాన్ శ్రీ అయ్యప్ప ఆలయం నుంచి సువర్ణభూమి మహా పాదయత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో  స్వాములు నడక యాత్ర ప్రారంభించడం జరుగుతుందన్నారు. ,11వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా కందూర్ లోని  రామలింగేశ్వరస్వామి గుడిలో జరిగే ఈ మహా పడి పూజ కార్యక్రమాలరాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్, మాజీ కార్పొరేటర్ టి. ప్రేమ్ దాస్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సానెం శ్రీనివాస్ గౌడ్,

దక్కన్ శబరి పీఠం అయ్యప్ప సేవా సమితి  అధ్యక్షుడు  సంరెడ్డి ప్రమోద్ రెడ్డి, ప్రతినిధులు రాము గౌడ్, అర్థం శ్రీనివాస్ గుప్త, సంకూరి జయప్రకాష్, పులిజాల వివేకానంద, సంతోష్ గుప్త, నర్సిరెడ్డి, సారంగ రవికుమార్ తో పాటు  సానెం నర్సింగ్ గౌడ్, వెంకటేష్ గౌడ్, టి.ప్రేమ్ గౌడ్, అశోక్ సాగర్, బాస శ్రీనివాస్, గట్టయ్యలు పాల్గొంటార న్నారు