2 September, 2026 | 11:27 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

యువతకు ఆదర్శం స్వామి వివేకానంద

05-07-2025 | 12:00am

మంథనిలో స్వామి వివేకానంద స్టాచ్యూ ఫౌండర్ అండ్ చైర్మన్ బెజ్జంకి డిగంబర్

మంథని,జూలై 4(విజయ క్రాంతి)యువతకు ఆదర్శం స్వామి వివేకానంద అని, స్వామి వివేకానంద స్టాచ్యూ ఫౌండర్ అండ్ చైర్మన్ బెజ్జంకి డిగంబర్ అన్నారు. శుక్రవా రం స్వామి వివేకానంద 123వ వర్ధంతిని పురస్కరించుకొని మంథని పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా గల స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా డి గంబర్ నివాళులర్పించారు.

ఈ సందర్భంగా డిగంబర్ మాట్లాడుతూ భారత దేశ గొప్పతనాన్ని సంస్కృతిని ప్రపంచ వ్యాప్తం చేసింది స్వామి వివేకానంద అని ఆయన పేర్కొన్నారు. చికాగోలో జరిగిన ప్రపంచ మత మ హాసభల్లో హిందూ మత గొప్పతనాన్ని ప్ర పంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అని, స్వామి వివేకానంద మా టలు నేటి యువతకు గొప్ప మార్గదర్శకంగా ఉంటాయని, ఆయనను ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకోవాలని, మంథని పట్టణం లో తాను.

ఈ విగ్రహం నెలకొల్పడాన్ని నా అదృష్టంగా భావిస్తున్నానని, దీనికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కా ర్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ మంథని అధ్యక్షులు కొత్త శ్రీనివాస్, వ్యవసాయ కా ర్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బూ డిద గణేష్, సీనియర్ సిటిజన్ తాటి బుచ్చ య్య గౌడ్, సిపిఎం నాయకులు బావు రవి తోపాటు తదితరులుపాల్గొన్నారు.