22-12-2025 10:44:32 PM
అన్ని జీల్లాలో ప్రమాణ స్వీకార మహోత్సవాలు
కుభీర్,(విజయక్రాంతి): మండల కేంద్రం కుబీర్ తో పాటు మండలంలోని 42 జీపీల్లో సోమవారం నూతనంగా ఎన్నికైన సర్పంచులచే ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు ప్రమాణ స్వీకారం చేయించారు. వీరితోపాటు ఉప సర్పంచ్లు వార్డు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించి వారికి జీపీ బాధ్యతలను అప్పగించారు. ప్రతి జిపిలో కన్నుల పండుగ జరిగిన ఈ పదవీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాలకు గ్రామస్తులు తరలివచ్చి నూతన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు శాలువాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని దీనికిగాను ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. రానున్న ఐదేళ్లలో గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు తమ శక్తి వంచన లేకుండా కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆ గ్రామంలో జరిగిన కార్యక్రమాల్లో ప్రత్యేక అధికారి శంకర్ ఎంపీడీవో సాగర్ రెడ్డి, ఎంపీ ఓ పంచాయతీ కార్యదర్శులు ఆ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.