23-12-2025 12:19:25 AM
బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు మండలంలోని అంజనాపురం గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. అనంతరం నూతన సర్పంచ్ బానోత్ నరసింహ, ఉప సర్పంచ్ భూక్య జయశ్రీ, వార్డ్ మెంబర్లు ప్రమాణ స్వీకారానికి మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి హాజరై నూతన పాలకవర్గం సభ్యులను ఘనంగా సత్కరించారు. అనంతరం వారికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ పురుషోత్తం, మాజీ ఎంపీటీసీ భూక్య సేవాలాల్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.