23-12-2025 12:00:00 AM
ఆర్మూర్ ఎస్‌హెచ్‌ఓ
అర్మూర్, డిసెంబర్22 (విజయక్రాంతి) : ఈవ్ టీజింగ్ చేస్తే షీ టీంకు సమాచారం ఇవ్వాలనీ ఎవరైనా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, ఈవ్ టీజింగ్ చేసిన షీ టీంకు వెంటనే సమాచారం ఇవ్వాలని ఆ ర్మూర్ ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ అన్నారు. అంకాపూర్ లోని భా ర్గవి విద్యానికేతన్‌లో క్రైమ్ గురించి విద్యార్థినిలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ విద్యార్థినిలు, ఉద్యోగినిలు, మహిళలు ఈవ్టీజింగ్, వేధింపులకు గురైతే పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన షీటీంకు సమాచారం ఇవ్వాలన్నారు.
సమాచారం ఇచ్చిన మహిళలు, విద్యార్థినిల పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఈవ్ టీజింగ్కు గురయ్యే వారు భయపడకుండా సమాచారం ఇస్తే రక్షణ కల్పిస్తామన్నారు. షీటీం నెంబర్ 87126 59795కు, డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. క్యూఆర్ కోడ్ ద్వారా షీ టీం వారికి ఫిర్యాదు చేసే విధానాన్ని మహిళలకు వివరించారు. అనంతరం కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు తులసి, ఉపాధ్యా యులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.