calender_icon.png 23 December, 2025 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఉపాధి హామీ’ని రద్దు చేయాలని కేంద్రం చూస్తోంది

23-12-2025 12:20:57 AM

  1. గాంధీ పేరు తొలగించవద్దు
  2. పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు  

హైదరాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాంతి ) : మహాత్మగాంధీ పేరు తో ఉన్న జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని ర ద్దు చేయడం సరికాదని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు విమర్శించారు. నోట్లపై ఉన్న గాంధీ బొమ్మను తీసి సావర్కర్ బొమ్మ పె ట్టాలని మోదీ చూస్తున్నారని వీహెచ్ మండిపడ్డారు. సోమవారం ఆయన గాంధీభ వన్‌లో మీడియాతో మాట్లాడుతూ మోదీ చేస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు ప్రజలు తిరగబడే రోజులు వస్తున్నాయని హెచ్చరించారు.

హిందూ పేరుతో రాజకీయాలు చేసి లబ్ధి పొందాలని బీజేపీ చూస్తోందన్నారు. దేశం కోసం ఆర్‌ఎస్‌ఎస్ ఎక్కడా పనిచేయలేదన్నారు. దేశ కోసం గాంధీ తన జీవితాన్ని త్యాగంచేశారని పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్‌భగవత్ ఇండియాను హిందూ దేశం అంటున్నారని, మన దేశం లో అన్ని మతాల వారు ఉన్నారని తెలిపారు.