calender_icon.png 23 December, 2025 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాభివృద్ధికోసమే నా అడుగు..

23-12-2025 12:22:01 AM

-లక్ష్మీదేవిపేట గ్రామ సర్పంచ్ బొమ్మకంటి వంశవతి రమేష్

వెంకటాపూర్, డిసెంబర్22(విజయక్రాంతి): గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజల విశ్వాసాన్ని చూరగొని లక్ష్మీదేవిపేట గ్రామ సర్పంచ్గా ఎన్నికైన బొమ్మకంటి వంశవతి రమేష్ సోమవారం అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మండలస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధు లు, గ్రామ పెద్దలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన సర్పంచ్కు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రమాణ స్వీ కారం అనంతరం సర్పంచ్ బొమ్మకంటి వంశవతి రమేష్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధే నా ప్రతి అడుగు అని, ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు అంకితభావంతో పనిచేస్తానని, గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే నా లక్ష్యమని అన్నారు. గ్రామంలో త్రాగునీటి సమస్యల పరిష్కారం, పారిశుద్ధ్య అభివృద్ధి, అంతర్గత రహదారుల మెరుగుదల, డ్రై నేజీ వ్యవస్థ బలోపేతం, వీధి దీపాల ఏర్పాటు, పాఠశాలలు, అంగన్వాడీల అభివృద్ధి, పేదల సం క్షేమానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే ఉపసర్పంచ్, వార్డు సభ్యులతో సమన్వయంతో గ్రామపంచాయతీని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. గ్రామంలో ఐక్యత, సమన్వయం, పా రదర్శక పాలనకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. అనంతరం గ్రామస్థులు నూతన సర్పంచ్ను శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు.