22-12-2025 10:41:26 PM
చేగుంట,(విజయక్రాంతి): చేగుంట గ్రామ పంచాయతీలో సంబురంగా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహించారు, అనంతరం సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్ లు ఉపసర్పంచ్ మొహమ్మద్ రఫిక్ ను శాలువాతో సన్మానం చేశారు. ఈ సందర్బంగా ఉపసర్పంచ్ రఫిక్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన వార్డ్ ప్రజల రుణం తీర్చుకుంటానని వార్డ్ గ్రామాభివృద్ధి ద్యేయంగా పనిచేస్తానని అన్నారు.
ఈ సందర్భంగా పాలకవర్గాన్ని గ్రామ పెద్దలు యువకులు, పూల మాలలు వేసి శాలువాలతో ఘనంగా సత్కరించి మిఠాయిలు తినిపించారు. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ రఫిక్ సర్పంచ్ మాట్లాడుతూ.గ్రామ ఉపసర్పంచ్ గా చేయడం ఆనందంగా ఉందని గ్రామ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తానని గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, గెలుపొందిన వెంటనే రోడ్డు పక్క కాలనీలో నీటి సమస్యను సొంత నిధులతో తీర్చాలని పాలకవర్గంతో గ్రామ పెద్దల సహాయ సహకారాలతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు.