22-12-2025 10:47:32 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా శ్రీవాణి వాసు యాదవ్ సోమవారం అట్టహాసంగా ప్రమాణస్వీకారం చేశారు. గ్రామ ప్రజలు, వార్డు సభ్యులు కార్యకర్తలు యువత అందరూ ఊరేగింపు గా బయలుదేరి గ్రామ పంచాయతీలో ప్రత్యేక అధికారి, కార్యదర్శి సమక్షంలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు నా మీద నమ్మకంతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. పార్టీలకు అతీతంగా సేవా చేస్తానని హామీ ఇచ్చారు.అనంతరం గ్రామ పెద్దలను సన్మానించారు.