calender_icon.png 23 December, 2025 | 12:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పొడిచన్‌పల్లి పాఠశాలలో గణిత దినోత్సవం

23-12-2025 12:00:00 AM

విజయక్రాంతి, డిసెంబర్ 22 :జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా పొడిచన్ ప ల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఆధునిక గణిత శాస్త్రానికి పునాదులు వేసిన అసాధారణ మేధావి శ్రీనివాస రా మానుజన్ పటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నూతనంగా సర్పంచ్ గా ఎన్నికయిన ఎర్ర వెంకయ్య(యేసు), ఉపసర్పంచ్ సంతోష్ రెడ్డి, గ్రామ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు రజని కాంత్ రెడ్డి, యాదయ్య, నారాయణ రెడ్డి తదితరులు హాజరై విద్యార్థులు చేసినటువంటి గణిత సంబంధ నమూనాలను, విద్యార్థులు స్వయంగా గీసిన శ్రీనివాస రామానుజన్ చిత్రపటాలను తిలకించి విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఫాజిల్ హుస్సేన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.