calender_icon.png 23 December, 2025 | 12:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాప్రభుత్వంలో నగరాన్ని అభివృద్ధి చేస్తాం

22-12-2025 10:58:10 PM

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి 

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): రాజకీయాలకు అభివృద్ధి విషయంలో తావు లేకుండా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. సోమవారం  7వ డివిజన్ పరిధిలో 1 కోటి రూపాయలతో సైడ్ డ్రైనేజీ, కల్వర్టు నిర్మాణం, పబ్లిక్ గార్డెన్ లో చిన్న పిల్లలకు ఆట వసతుల కల్పనకు వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి తో కలిసి ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుండి నగర అభివృద్ధికి కృషి చేస్తున్నానని, సంక్షేమ పథకాల అమలులో పార్టీలకతీతంగా అందిస్తున్నామని అన్నారు. నియోజకవర్గంలో గతంలో కాంగ్రెస్ కార్పొరేటర్స్ ఉన్న ఒక్కొక్క వార్డుకు కనీసం 50 లక్షలు పెట్టి దాకలు లేవని కానీ ఇప్పుడు ప్రతి వార్డుకు 5 కోట్ల రూపాయల మేరకు నిధులు కేటాయించి పనులను పూర్తి చేస్తున్నామని, కార్పొరేషన్ నిధులు, ఎమ్మెల్యే నిధులు, ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో అభివృద్ధి పనులకు సద్వినియోగం చేసుకుంటున్నామని తెలిపారు. అభివృద్ధి విషయంలో ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, 7వ డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, కాంగ్రెస్ యూత్ నాయకులు తోట పవన్, బంక సంపత్ యాదవ్, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బూర గాంధీ, సెక్రెటరీ విజయ్ కుమార్, చంద్రమౌళి, గిరిజ, ప్రమీల, అన్నపూర్ణ, పుల్లారావు, సురేందర్, యాదగిరి, సందీప్, కాంగ్రెస్ నాయకులు, ప్రజలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.