calender_icon.png 16 October, 2025 | 12:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్‌వైజీ అవుట్ స్టాండింగ్ సినిమా

16-10-2025 01:24:13 AM

సాయిదుర్గతేజ్ హీరోగా నటిస్తున్న  చిత్రం ‘ఎస్‌వైజీ: సంబరాల యేటిగట్టు’. ఐశ్వర్యలక్ష్మి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. రోహిత్ కేపీ దర్శకత్వంలో కే నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మిస్తున్నారు. సాయిదుర్గతేజ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ బుధవారం ‘అసుర ఆగమన’ గ్లింప్స్‌ను విడుదల చేశారు.

ఈ ఈవెంట్‌లో తేజ్ మాట్లాడుతూ.. “నా జీవితంలో చాలా ముఖ్యమైన సినిమా ఇది. దీనికోసం నా సర్వస్వం ధారపోశాను. సినిమా అవుట్ స్టాండింగ్‌గా ఉంటుంది. ఇది నా ప్రామిస్‌” అన్నారు. దర్శకుడు రోహిత్ మాట్లాడుతూ “ఈ సినిమా కోసం సాయిదుర్గతేజ్ అయినంతగా ట్రాన్స్‌ఫర్మేషన్ మిగతా వారికి అంత ఈజీ కాదు” అని చెప్పారు. ‘సినిమా చాలా పెద్ద సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నామ’ని ప్రొడ్యూసర్లు నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి అన్నారు. డైరెక్టర్లు దేవకట్ట, వశిష్ట, వీఐ ఆనంద్, నిర్మాత వివేక్ కూచిబొట్ల పాల్గొన్నారు.