16-10-2025 01:26:02 AM
తెలుగులో పాగా వేయాలని చూస్తున్న మాళవిక మోహనన్‌కు వెతకబోయిన తీగ చేతికే చిక్కినట్టు ‘రాజాసాబ్’తో ఎంట్రీ ఛాన్స్ దక్కింది. టీజర్, ట్రైలర్‌లో ప్రభాస్‌తో రొమాన్స్ చేస్తూ మెస్మరైజ్ చేసింది. అందుకు ఫలితమే అన్నట్టుగా తెలుగులో మరో మెగా ఛాన్స్ కొట్టేసిందీ ముద్దుగుమ్మ. మాళవికకు టాలీవుడ్ మెగాస్టార్‌తో ఆడిపాడే అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత బాబీ దర్శకత్వంలో చిరంజీవి మరో సినిమా చేయనున్నారు.
ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు అవకాశం ఉండగా, అందు లో ఒక పాత్ర కోసం మాళవికను ఎంపిక చేసుకునే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని ఫిల్మ్‌నగర్ వర్గాల టాక్. ఈ కాంబో ఫైనల్ అయితే టాలీవుడ్‌లో మాళవిక కెరీర్ ఆరంభమైనట్టే నని సినీ విమర్శకుల ఉవాచ.