calender_icon.png 8 November, 2025 | 6:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ భక్తికి ప్రతీక.. వందేమాతరం

08-11-2025 12:00:00 AM

-వందేమాతరం గీతం 150 ఏళ్ల వేడుకల్లో కలెక్టర్ రాజార్షి షా.

-ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా సామూహిక గీతాలాపన

ఆదిలాబాద్/నిర్మల్/కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 7 (విజయక్రాంతి): మహాక వి బంకిమ్ చంద్ర ఛటర్జీ భారతీ య సంస్కృతికి చేసిన సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా కీర్తించారు. జాతీయ గీతం వందే మాతరం ప్రతి పౌరుడిలో దేశభక్తి భావాన్ని మరింతగా పెంపొందించ డంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. మన జాతీయ గేయం వందేమాతరం రచిం చి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్థానిక  కలెక్టరేట్లో శుక్రవారం ఘనం గా సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజార్షి షా పాల్గొని అధికారులతో కలిసి వందే మాతరం గీతాన్ని ఆలపించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... వందేమాతరం భారత స్వాతంత్య్ర ఉద్యమానికి ఆత్మలాంటిదని, స్వాతంత్య్ర సమరయో ధుల్లో దేశభక్తిని జ్వాలింప చేసిన గీతమిదేనని పేర్కొన్నారు. దేశ చరిత్రలో వందే మాతరం గీతం ప్రాధాన్యత అపారమైందని, ప్రతి భారతీయుడి హృదయంలో దేశాభిమానాన్ని మేల్కొలిపిన శక్తి ఈ గీతమే అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వందేమాతరం సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించబడిందని కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యా ప్తంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వివిధ సంస్థ ల్లో అధికారులు, సిబ్బంది సామూహికంగా పాల్గొని వందే మాతరం గీతాన్ని ఆలపించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాజేశ్వర్, శ్యామల దేవి, శిక్షణ కలెక్టర్ సలోని చాబ్ర, ఆర్డీఓ స్రవంతి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

నేటి యువతకు స్ఫూర్తి 

నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా వందేమాతరం 150 వసంతోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బకెట్ చంద్ర చటర్జీ రచించిన వందేమాతర గీతానికి 150 ఏళ్లు పూర్తి చేసుకో సందర్భంగా ఆనాటి ఉద్యమ స్ఫూర్తి ని జాతీయ భవాని ప్రతి ఒక్కరు కొనియాడారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ జానకి షర్మిల బిజెపి కార్యాలయంలో ఎమ్మె ల్యే మహేశ్వర్ రెడ్డితో పాటు పలువురు హాజరై వందేమాతర గీతాన్ని ఆలపించారు. వందేమాతరం స్ఫూర్తిని నేటి యువతకు ప్రతి ఒక్కరు తెలియజేయవలసిన అవసరం ఉందని వారంతా గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమం కలెక్టర్ కారుల ఉద్యోగులు అధికారులు పార్టీల నేతలు పాల్గొన్నారు

వందేమాతరం దేశభక్తికి నిర్వచనం

వందేమాతరం గీతం దేశభక్తికి నిర్వచనం అని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. వందేమాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా శుక్రవారం  కలెక్టరేట్ లో వందేమాతరం సామూహిక గీతాలాపన కార్యక్రమానికి  ఆర్డీవో అధికారి లోకేశ్వర్ రావు, అధికారులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, యువజన సంఘాల ప్రతినిధులతో కలిసి హాజరై గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వందేమాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తి కావడం సంతోషంగా ఉందని, స్వాతంత్ర ఉద్యమ కాలంలో పోరాటానికి స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. భారతీయులందరిలో స్వాతంత్ర కాంక్షను రగిలించిందని, దేశ ఐక్యతకు ఈ జీతం నిదర్శనమని అన్నారు. వందేమాతరం గీతాన్ని ఆలపించడం ద్వారా దేశభక్తిని చాటుదామని తెలిపారు. 

జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన వందేమాతరం గీతాలాపన లో ఎస్పీ కాంతిలాల్ పాటిల్ పాల్గొన్నారు. దీంతోపాటు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాల యాలతో పాటు ప్రభుత్వ , ప్రైవేటు పాఠశాలలో వందేమాతరం గీతాలాపన చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది, యువజన సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.