08-11-2025 06:54:57 PM
మాజీ ఎంపీ, రాజ్ గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం
ఆదిలాబాద్ (విజయక్రాంతి): బిర్సా ముండా 150వ జయంతి కార్యక్రమం మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలోని సమతా మైదానంలో ఈ నెల 16న ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని మాజీ ఎంపీ, రాజ్ గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపురావు అన్నారు. ఆదివాసులు నిరంతరం ఎదుర్కొంటున్న సమస్యలపై ఎనలేని ఎన్నో పోరాటాలు జరుగుతున్న పాలక వర్గాలు పట్టించుకునే పాపాన పోలేదన్నారు.
వలస వచ్చిన వారికి అభివృద్ధికి సహకరిస్తున్న ప్రభుత్వాలు పుట్టుకతో ఇక్కడే ఉంటున్న ఆదివాసులకు మాత్రం ఎక్కడ వేసినా గొంగడి అక్కడే ఉన్న చందంగా వ్యవహరిస్తున్నారన్నారు. కనుకనే బిర్సా ముండా జయంతి సందర్భంగా జాతీయ స్థాయిలో ఆదివాసీ హక్కులపై చర్చలు జరిపి న్యాయ పోరాటానికి ముందుకు వెళ్ళే విధంగా గత కార్యక్రమాన్ని సమీక్షించుకుని, భవిష్యతు పోరాటాలకు ముందడుగు వేయబోతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిర్సా క్రాంతి దళ్ అధ్యక్షులు కినక సురేష్, నాయకులు సెడ్మాకి ఆనందరావు, కురిసెంగ తానాజీ, పెండోర్ మోహన్, మెస్రం ఫరీద్, నరేష్, నాయకులు పాల్గొన్నారు.