08-11-2025 06:46:58 PM
మణుగూరు (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రజాభవన్ లో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కేక్ కట్ చేసి పార్టీ నాయకులకు తినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. బడుగు బలహీన వర్గాల, నిరుపేదల పక్షపాతి అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకుంటూ మరెన్నో సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు పీరినాకి నవీన్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తరుణ్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కూరపాటి సౌజన్య, ఐఎన్టియుసి బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణంరాజు, శివాలయం చైర్మన్ కూచిపూడి బాబు, రహీం పాషా, రాంబాబు, గొల్లపల్లి నరేష్, అనుబంధ సంఘాల బాధ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.