08-11-2025 06:39:15 PM
బూర్గంపాడు (విజయక్రాంతి): మండలంలోని కృష్ణసాగర్ లో ఉన్న తెలంగాణ గిరిజన గురుకుల బాలుర కళాశాల చెందిన ఐదుగురు విద్యార్థులు అండర్–17 విభాగంలో హాకీ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ మెండెం దేవదాస్ తెలిపారు. జిల్లా స్థాయి సెలక్షన్ పోటీలు కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో నిర్వహించగా, కృష్ణసాగర్ గురుకుల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరచి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అర్హత సాధించారు. బైపీసీ ప్రధమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు పి. సాయిరాం, ఎస్. సాయి కార్తీక్, ఎస్. కృష్ణ మనోహర్, కే. కిరణ్, పి. అనిల్ లను ప్రిన్సిపాల్ మెండెం దేవదాస్, ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థులను అభినందిస్తూ, రాష్ట్రస్థాయిలో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.