calender_icon.png 8 November, 2025 | 8:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శంకర్ పల్లి లిటిల్ స్టార్స్ హై స్కూల్ లో ఎల్. ఎల్. సి కార్యక్రమం

08-11-2025 06:57:06 PM

శంకర్ పల్లి: శంకర్ పల్లి పట్టణంలోని లిటిల్ స్టార్స్ హై స్కూలు శనివారం లెర్నర్ లీడ్ కాన్ఫరెన్స్( ఎల్ ఎల్ సి) కార్యక్రమం పాఠశాల నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు అన్ని సబ్జెక్టులలో చాలా చురుకుగా పాల్గొని అన్ని విషయాలు చాలా చక్కగా వివరించారు. చార్టులు, సైన్స్ లో గల విషయాలు చాలా చక్కగా చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎస్సై బి. శ్రీశైలం, పట్టణంలోని చైతన్య, జాగృతి కళాశాల అధ్యాపకులు, శంకర్ పల్లి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ గండేటి శ్రీనాథ్ గౌడ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు పాఠశాలలో ఇంకా ఎన్నో జరపాలని అన్నారు. ఈ కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో ఎంతో ఉత్సవం కలిగేస్తాయని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన పాఠశాల యాజమాన్యాన్ని ప్రశంసించారు. కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. తమ పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిధులకు ప్రత్యేక ధన్యవాదాలు పాఠశాల కరస్పాండెంట్ సంజిత్ కుమార్ తెలిపారు. కార్యక్రమం విజయవంతం చేసినందుకు పాఠశాల ఉపాధ్యాయులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు.