calender_icon.png 8 November, 2025 | 8:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల కల్లాల దగ్గరికి వెళ్లి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

08-11-2025 06:49:21 PM

మాగనూరు: రైతులు పండించిన వరి ధాన్యాన్ని రైతుల కల్లాల దగ్గరికి వెళ్లి కొనుగోలు చేయాలని ఉమ్మడి కృష్ణ మాగనూరు మండల బిజెపి అధ్యక్షులు ఎన్ నరసప్ప ప్రభుత్వాన్ని కోరారు. శనివారం మాగనూరు మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఉమ్మడి మండలంలో మహిళా సమైక్య ద్వారా, సింగల్ విండో ద్వారా రైతుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే అధికారులు రైతుల కల్లాల వద్దకు వెళ్లి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

ఐకెపి, పిఎసిఎస్ కొనుగోలు కేంద్రాల ద్వారా స్వీకరించే ప్రతి వరి గింజకు రైతుల పొలాల నుండి మిల్లలకు చేర్చే రవాణా, గన్ని బ్యాగ్స్ ,లేబర్ కూలీలు, బస్తాలు కుట్టే డబ్బులు, కూడా కొనుగోలు కేంద్రాలకు ఇచ్చిన కమిషన్ తో సహా ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తిగా మాత్రమే ఉంటూ రైతులకు అనేక కఠినమైన నిబంధనలు విధించి  తేమ శాతం 17 ఉండాలని, సెంటర్ దగ్గరికి వడ్లు తీసుకురావాలని ,నిబంధనల ద్వారా రైతులకు అదనపు ఖర్చులతో పాటు పని భారము ఎక్కువ అవుతుందన్నారు.

అధిక వర్షం పడి ధాన్యం రంగు మారి ఇప్పటి కె దిగుబడి రాక పెట్టుబడి రాక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రైతులకు ఈ నిబంధనలు విధించడం బిజెపి శాఖ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. వెంటనే వ్యవసాయ అధికారులు నిబంధనలను సడలించి గతంలో లాగా రైతుల కల్లాల దగ్గరకు వెళ్లి ధాన్యం కొనుగోలు చేయాలి, తేమశాతం పెంచి కొనాలని లేనియెడల రైతుల పక్షాన బిజెపి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని వారన్నారు.