calender_icon.png 8 November, 2025 | 8:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

17వ డివిజన్‌లో ముళ్ల పొదలను తొలగించిన కార్పొరేషన్ సిబ్బంది

08-11-2025 06:43:00 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): రేకుర్తి 17వ డివిజన్లో విజయదుర్గ కాలనీ రోడ్ నెంబర్ 2 నుండి జగిత్యాల రోడ్ విపార్క్ వరకు రోడ్డుకు ఇరు వైపులా రహదారికి అడ్డంగా ఉన్న ముళ్ళ పొదలు, చెట్లను కార్పొరేషన్ సిబ్బంది శనివారం తొలగించారు. ఇటీవల బీజేపీ పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాల్ రెడ్డి ఆధ్వర్యంలో18వ డివిజన్ బూత్ అధ్యక్షులు కమిషనర్ కు వినతి పత్రం ఇవ్వగా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది జెసిబితో రహదారికి ఇరువైపులా ఉన్న ముళ్ళ చెట్లను తొలగించారు.

బీజేపీ నాయకులు జాడి బాల్ రెడ్డి, నరహరి లక్ష్మారెడ్డి, కాలనీవాసులు కమిషనర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బాల్ రెడ్డి మాట్లాడుతూ విలీన గ్రామాలైన రేకుర్తిలోని 18, 19 డివిజన్లో అనేక రహదారులలో ప్రజలు నడవాలంటే ఇబ్బందికరంగా ఉన్న రోడ్లను కమిషనర్ స్వయంగా పరిశీలించి ఇరువైపులా సైడ్ మోరీలను నిర్మించాలని, రోడ్లు వేయించాలని కోరారు.