08-11-2025 06:56:14 PM
ఉప్పల్,(విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్ డివిజన్ అశోక్ నగర్ లోని శిథిలావస్థలో ఉన్న బస్టాండు తొలగించి నూతన బస్టాండ్ ను ఏర్పాటు చేయాలని డిసిసి మాజీ ఉపాధ్యక్షుడు మేడ్చల్ జిల్లా మోసలీ శ్రీనివాసరెడ్డి అన్నారు. మల్లాపూర్ డివిజన్ అశోక్ నగర్ లో గత కొంతకాలంగా బస్టాండ్ భవనం శిథిలావస్థలో ఉందని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు. శిధిలావస్థకు చేరిన బస్టాండు ఎప్పుడు కూలిపోతుందో తెలియక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శిధిలా వస్తున్న బస్టాండ్ ను తొలగించి నూతన బస్టాండ్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు