08-11-2025 12:00:00 AM
ఆటలతోనే శారీరక దృఢత్వం: మాజీ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి
మణికొండ, నవంబర్ 7, విజయక్రాంతి : మణికొండ మున్సిపాలిటీలోని గౌతమ్ మోడల్ స్కూల్లో శుక్రవారం ’స్పోరట్స్ డే’ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. విద్యార్థుల క్రీడా నైపుణ్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో ప్రాంగణం సందడిగా మారింది.ఈ కార్యక్రమానికి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ కొండకల నరేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై స్కూల్ ప్రిన్సిపాల్ భానుశా, డీన్ భరద్వాజ్లతో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా దినోత్సవాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. చదువుతో పాటు విద్యార్థులు క్రీడల్లోనూ చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆటలు శారీరక దృఢత్వానికి, ఆరోగ్యానికి, క్రమశిక్షణతో కూడిన జీవన విధానానికి ఎంతగానో దోహదపడతాయని ఆయన నొక్కి చెప్పారు.ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, పీటీ మాస్టర్, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బి. రవి కాంత్ రెడ్డి, బి. శివకుమార్ ఈ వేడుకలో పాల్గొన్నారు.