calender_icon.png 8 November, 2025 | 8:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పగిడేరులో విప్లవోద్యమ నేత కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి వర్ధంతి సభ

08-11-2025 06:43:39 PM

మణుగూరు (విజయక్రాంతి): భారత విప్లవోద్యమ నేత, ప్రతిఘట నోద్యమ నిర్మాత కామ్రేడ్‌ చండ్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతి సభ శనివారం పగిడేరు గ్రామంలోని అమరుల స్థూపం వద్ద సదానందం అధ్యక్షతన జరిగింది. ముందుగా నాయకులు పుల్లారెడ్డికి, అమరవీరులకు నివాళి అర్పించారు. అనంతరం అఖిల భారత కార్మిక సంఘాలసమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్ల అంజయ్య, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర నాయకులు కొండన్న, ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యు స్త్రీ విముక్తి రాష్ట్ర కన్వీనర్ అరుణక్క వక్తలుగా ప్రసంగించారు. భూమి, బుక్తి, విముక్తి కోసం సాగిన విప్లవ పోరాటంలో అనేకమంది పోరు మార్గంలో పయనించి తమ ప్రాణాలను తుణప్రాయంగా అర్పించారన్నారు.

దోపిడీ దౌర్జన్యాలను రూపు మాపేందుకు అనునిత్యం పోరు సలిపినారని, సమసమాజమే లక్ష్యంగా సాగే సమరపు దారిలో తమ నెత్తురులు ధారపోశారని, వారి త్యాగాలు వెలకట్ట లేనియని కొనియాడారు. ప్రతి ఘటన పోరాట నిర్మాత చండ్ర పుల్లారెడ్డి లాంటి వారు ఈ నెలలోనే అమరత్వం చెందారన్నారు. దేశంలోని సహజ సంపదను కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేయడానికి జరిగే కుట్రల్లో భాగమే ఆపరేషన్ కగార్ అని, కొన్ని నెలల కాలంగా మానవ హన నంసాగుతూనే ఉందన్నారు. బిజెపి ప్రభుత్వ చర్యలను ఐక్య ఉద్యమాలతో  తిప్పి కొట్టాలన్నారు. అమరుల  ఆశయాల సాధన కోసం పీడిత ప్రజల పక్షాన సాగే ప్రజా ఉద్యమాలలో ముందు బాగాన నిలబడటమే ఆ అమరవీరులకు అర్పించే నిజమైన నివాళన్నారు. కార్యక్రమంలో నాయకులు రామన్న, రాజన్న, నరేందర్, బాబన్న, సత్తన్న, గ్రామస్తులు పాల్గొన్నారు.