calender_icon.png 8 November, 2025 | 8:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ నాయకులు గొట్టెటి ముత్తయ్యకు నివాళులర్పణ

08-11-2025 06:47:59 PM

అశ్వాపురం,(విజయక్రాంతి): మండల పరిధిలోని మల్లెలమడుగు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు మచ్చ నరసింహారావు మామ, దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగర్ (శ్రీనగర్ కాలనీ) నివాసి గొట్టెటి ముత్తయ్య శనివారం కన్నుమూశారు. ఈ విషయం తెలిసిన అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య ఆధ్వర్యంలో మండల నాయకులు దుమ్ముగూడెంకు చేరుకుని, మృతదేహానికి పూలమాలలు అర్పించి నివాళులర్పించారు.

అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో మాజీ  ఎంపీటిసి  బేతం రామకృష్ణ, పార్టీ ప్రధాన కార్యదర్శి తూము పెద్ద రాఘవులు, ఆవుల రవి, బీసీ సెల్ అధ్యక్షుడు బచ్చు వెంకటరమణ, మల్లెలమడుగు గ్రామ శాఖ అధ్యక్షుడు బారాజు సంపత్, కార్యదర్శి చెంచాల రాము, ఎస్టీ సెల్ నాయకుడు పద్దం నరసింహారావు, యువజన నాయకుడు గొడ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.