08-11-2025 06:52:09 PM
యాదగిరిగుట్ట (విజయక్రాంతి): యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి శ్రీమతి జస్టిస్ సుజాత కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు స్వాగతం పలికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనం తెలిపారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉందని తెలియజేశారు.