calender_icon.png 7 May, 2025 | 4:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలకవ్యాఖ్యలు

07-05-2025 12:03:55 AM

కుల ఆధారిత రిజర్వేషన్లు రైలు బోగీల్లాంటివి

పేర్కొన్న సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్

న్యూఢిల్లీ, మే 6: రిజర్వేషన్లపై సుప్రీంకో ర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్ర స్థా నిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్‌పై మంగళవారం సుప్రీం లో విచారణ జరిగింది. ఈ సందర్భంగాకు ల ఆధారిత రిజర్వేషన్లు రైలు బోగీల్లాంటివని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.

ఆ కంపార్ట్‌మెం ట్‌లోకి ప్రవేశించిన వ్యక్తులు ఇతరు లను లో పలికి రానివ్వరని పేర్కొన్నారు. అయితే ప్ర భుత్వాలు మరిన్ని వెనుకబడిన తరగతులను కూడా గుర్తించాలని సూచించారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబ డిన వ్యక్తులు కూడా మహారాష్ట్రలోనే ఎక్కువగానే ఉన్నారని.. వారు రిజర్వేషన్ల ప్రయో జనం ఎందుకు పొందకూడదని ఆయన ప్ర శ్నించారు.

కొన్ని కుటుంబాలు, సమూహాలు మాత్రమే రిజర్వేషన్ల వల్ల ప్రయోజనం పొం దుతున్నాయని స్పష్టం చేశారు. విషయంలో కి వెళితే.. మహారాష్ట్రలో 2 సంవత్సరంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగా యి. అయితే ఓబీసీ కో టా విషయంలో గొడవలు జరగ్గా.. న్యాయ పోరాటానికి దిగా రు. ఓబీసీలకు 27 శాతం కోటాను అమలు చేయడం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి న ఆర్డినెన్స్‌ను 2021లో సుప్రీం కొట్టేసింది. రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారి ని గుర్తించాలంటూ కమిషన్ ఏర్పాటు చేసిం ది.

కమిషన్ సిఫార్సుల దృశ్యా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మిం చకూడదని చెప్పింది. అప్పటి నుంచి ప్రభు త్వం సమాచారాన్ని సేకరించే పనిలో ఉండడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో జాప్యం జరుగుతూ వస్తోంది. అయితే తాజాగా మ రోసారి ఈ కేసు విచారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఓబీసీలకు సంబంధించిన సమాచారం ఉన్నప్పటికీ దానిని ప్రభుత్వం ఉపయోగించడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదించారు. రిజర్వేషన్ల ప్రయోజనాన్ని పొందేందుకు ఓబీసీల్లోనే వెనుకబ డిన వారిని గుర్తించాలని మరో న్యాయవాది తన వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న జస్టిస్ సూర్యకాంత్ రిజర్వేషన్లపై సమగ్ర విచారణ జరపాల్సి ఉందని తెలిపారు.