25-10-2025 01:14:30 AM
హుజూర్‌నగర్,అక్టోబర్ 24 (విజయక్రాంతి):నిరుద్యోగ యువత మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకుని నైపుణ్యం ఉన్న రంగం వైపు వెళ్లి విజయం సాధించాలని రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హుజూర్ నగర్ పట్టణంలో పెరల్ ఇంటర్‌నేషనల్ స్కూల్ ఆవరణలో నిర్వహిస్తున్న మె గా జాబ్ మేళా ఏర్పాట్లను అధికారులతో కలిసి శుక్రవారం మంత్రి పరిశీలించారు.
అ నంతరం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఈ మెగా జాబ్ మేళాకు ముఖ్య అతి థిగా రాష్ట్ర ఐటీ కమ్యూనికేషన్స్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు హాజరుకానున్నారని తెలిపారు.తెలంగాణ రాష్ట్ర డీట్ సంస్థ, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయన్నారు.ఈ జాబ్ మేళాలో సుమారు 150 కంపెనీలు పాల్గొంటున్నాయని, తమ పేర్లను క్యూఆర్ కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.
జాబ్ మేళకు నిరుద్యోగ యువత క్యూఆర్ కోడ్ ద్వారా నమోదును పరిశీలిస్తే సుమారుగా 30 వేల మంది యువత ఉద్యోగమేలకు హా జరు కావచ్చని తెలిపారు.అభ్యర్థులను దృష్టి లో ఉంచుకొని అక్టోబర్ 25, 26 రెండు రోజుల పాటు ఉద్యోగమేళా నిర్వహిస్తామని అందుకు తగిన ఏర్పాట్లు చేశారన్నారు. జాబ్ మేళాకు వచ్చే నిరుద్యోగ యువతకు ఉద యం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ అందిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నం దాలాల్ పవార్, జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ, అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ చరమందరాజు, ఆర్డీవో శ్రీనివాసులు, కాం గ్రెస్ నాయకులు కోతి సంపత్ రెడ్డి, దొంతగాని శ్రీనివాస్, తన్నీరు మల్లికార్జున్, అరు ణ్ కుమార్, అజిజ్ పాషా పాల్గొన్నారు.