10-04-2025 04:41:56 PM
రాజంపేట (విజయక్రాంతి): వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని గురువారం రాజంపేట సొసైటీ అధ్యక్షుడు నల్లవెల్లి అశోక్ కోరారు. రాజంపేటలో గల సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ... రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. రైతులు దళారులను ఆశ్రయించి ధాన్యాన్ని విక్రయించి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈఓ వెంకటేశ్వర్లు రైతులు పాల్గొన్నారు.