calender_icon.png 5 May, 2025 | 6:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వం మా డిమాండ్లను పరిష్కరించాలి

10-04-2025 04:48:42 PM

పోలీసులు, ఆర్టీఏ అధికారులు వేధిస్తున్నారు..  

ఆర్ఎంసి ప్లాంట్లతో తీవ్ర కాలుష్యం..  

తెలంగాణ కాంక్రీట్ మిల్లర్స్ ఓనర్స్, లేబర్ యూనియన్.. 

చైర్మన్ నాగరాజు.. 

రాజేంద్రనగర్: పోలీసులు, ఆర్టిఏ అధికారులు తమపై వేధింపులు ఆపాలని తెలంగాణ కాంక్రీట్ మిల్లర్స్ ఓనర్స్, లేబర్ యూనియన్ చైర్మన్ నాగరాజు డిమాండ్ చేశారు. ఇటీవల తలపెట్టిన బంద్ కు ముగింపు పలుకుతూ రాష్ట్రస్థాయి సమావేశాన్ని గురువారం బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాళీ మందిర్ లో రాష్ట్రంలోని ప్రాంతాల నుంచి తరలివచ్చిన కార్మికులతో కలిసి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ నాగరాజు, కన్వీనర్ రవి కుమార్ రెడ్డి, కన్వీనర్లు గోపాల్, శ్రీను యాదవ్ తదితరులు మాట్లాడారు. ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నో ఎంట్రీలోకి వస్తున్నారని పోలీసులు తమ నుంచి లక్షల్లో ఫైన్లు వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

తమ సమస్యల పరిష్కారానికి ఏప్రిల్ 5-10 వరకు బంద్ నిర్వహించిన్నట్లు తెలిపారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. దళారీ వ్యవస్థను నిర్ములంచాలని డిమాండ్ చేశారు. గవర్నమెంట్ తమకు ఉపాధి కూడా కల్పించాలని కోరారు. పెంచిన రేట్లు అమలు అయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నగర అభివృద్ధిలో మిల్లర్లు, లేబర్ల పాత్ర ఎంతో ఉందని చెప్పారు. ఆర్ ఎంసి ప్లాంట్లతో తీవ్ర వాయు కాలుష్యం ఏర్పడుతోందని ఆరోపించారు. భవనాల పైనుంచి ఎంతో మంది కిందపడి చనిపోతున్నారని, వారికీ ఉచిత ప్రమాద బీమా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. భవన నిర్మాణ కార్మికులకు డబుల్ బెడ్ రూమ్ లు అందజేయాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు తదితరులు భారీగా పాల్గొన్నారు.