14-07-2025 10:33:22 PM
వ్యాపారులకు పోలీసుల నోటీసులు..
మహబూబాబాద్ (విజయక్రాంతి): నేరాలు నియంత్రించడంలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో కీలకమని మహబూబాబాద్ పట్టణ సీఐ జీ. మహేందర్ రెడ్డి(CI Mahender Reddy) అన్నారు. ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఉత్తర్వుల మేరకు శ్రీ గట్ల మహేందర్ రెడ్డి టౌన్ సీఐ, ఎస్ఐలు శివ, ప్రశాంత్ సిబ్బందితో కలిసి మహబూబాబాద్ పట్టణంలోని షాపుల యజమానులకు సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నోటీసు అందజేశారు. నోటీస్ తీసుకున్న వ్యాపారులు 2 వారాల సమయంలో షాప్ లోపల, ఇరువైపులా కెమెరాలు బిగించి నేరాలను నియంత్రించడానికి సహకరించాలని సూచించారు.