14-07-2025 10:20:27 PM
కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): గురుకుల పాఠశాలలు, వసతి గృహాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, టిఏజిఎస్ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ వెంకటేష్ దోత్రే(Collector Venkatesh Dhotre)కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. వసతి గృహాలు గురుకుల పాఠశాలలో సర్వేలు నిర్వహించిన సందర్భంలో అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయని ముఖ్యంగా తిర్యానీ మండలం ఎస్టీ గురుకుల పాఠశాలలో సమస్యలు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. గిన్నదరి ఆశ్రమ పాఠశాలలోను సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు దృష్టికి వచ్చిందని తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న సౌకర్యాలు కల్పించడంలో విఫలమైనట్లు ఆరోపించారు. వెంటనే అధికారులు వసతి గృహాలు, గురుకులాలను సందర్శించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టీకానంద్, కార్తీక్, టి ఏ జిఎస్ జిల్లా అధ్యక్షురాలు మాల శ్రీ, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు సతీష్ తదితరులు పాల్గొన్నారు.