14-07-2025 10:18:07 PM
గుర్రపు పెద్దకొల్ల జై కుమార్ ముదిరాజ్..
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(MLC Teenmar Mallanna)పై, అతని కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని భారత చైతన్య యువజన పార్టీ(BCYP) 2023 ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గుర్రపు పెద్దకొల్ల జై కుమార్ ముదిరాజ్ పేర్కొన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ దాడి వెనుక కవిత అనుచరులు, జాగృతి కార్యకర్తలు ఉన్నారని ఆరోపించిన ఆయన, ఇది కేవలం మల్లన్నపై కాకుండా బీసీ సామాజిక వర్గంపై జరిగిన దాడిగా భావిస్తున్నామని అన్నారు.
ప్రజాస్వామ్య విలువలను బలహీనపరిచే ఇలాంటి హింసాత్మక చర్యలను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని పేర్కొన్నారు. కంచం పొత్తు, మంచం పొత్తు.... అనే సామెతను తప్పుగా అర్థం చేసుకుని భౌతిక దాడులకు దిగడం సరికాదని, సందేహాలుంటే వివరణ కోరడం ప్రజాస్వామ్య దారి అని స్పష్టం చేశారు. దాడిలో పాల్గొన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా BCYP నాయకులు జై కుమార్ ముదిరాజ్ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, గుయ్య సాయికృష్ణ యాదవ్ జగిత్యాల జిల్లా ఇన్చార్జి, కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, రెబ్బాస్ హరీష్ యాదవ్, మార్గం సురేష్ తదితరులు పాల్గొన్నారు.