ఆ పుస్తకాలు వెనక్కి తీసుకోండి!
- అధికారులకు విద్యాశాఖ ఆదేశాలు
- ఎస్సీఈఆర్టీ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు
హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): ఎస్‌సీఈఆర్టీ(స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. పాఠశాలలు పునఃప్రారంభం రోజు విద్యార్థులకు పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాల్లో ప్రచు రించిన ముందుమాటలో మాజీ సీఎం, మంత్రులు, అధికారుల పేర్లతో కూడిన పుస్తకాలను పంపిణీ చేశారు. దీనిపై తీవ్ర విమ ర్శలు రావడంతో విద్యాశాఖ స్పందించింది. పంపిణీ చేసిన ఆ పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని ఎంఈఓలు, డీఈవోలను ఆదేశిం చింది.
తెలుగు పుస్తకాల్లో ముందుమాట మార్చకుండా కొన్ని పుస్తకాల్లో తొలి సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అని, మరికొన్ని పుస్తకాల్లో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపేరుతో పాటు అప్పటి విద్యాశాఖ అధికారుల పేర్లను యథావిధిగా ఉంచి విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు. విమర్శలు వెల్లువెత్తడంతో పాఠ్యపుస్తకాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. అయితే ఈ పుస్తకాల్లోని ముందుమాట పేజీని చించేసి దాని స్థానం లో వేరే పేజీని అతికించాలని అధికారులు ముందు భావించా రు. కానీ ఆ పేజీ వెనుకాల వందేమాతరం, ప్రతిజ్ఞ ఉండడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.
సుమారు రూ.5 కోట్లు నష్టం!
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 24 లక్షల మం ది విద్యార్థులున్నారు. వీరికోసం 2 కోట్ల 10 లక్షల పుస్తకాలు ముద్రించారు. వీటికి దాదా పు రూ.120 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలిసింది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మం త్రులు, అధికారుల పేర్లతో ఉన్న పుస్తకాలు దాదాపు 24 లక్షల వరకు ఉంటాయని అంచనా. ఒక్కో పుస్తకానికి కనీసం రూ.20 అనుకున్నా వీటి విలువ సుమారు రూ.5 కోట్లు అవుతుందని ఓ సంఘం నేత తెలిపారు. అయితే ఇలా వెనక్కి తీసుకుంటున్న పుస్తకాలకు బదులుగా కొత్తవి మళ్లీ ఎప్పుడు పంపిణీ చేస్తారనే విషయంపై స్పష్టతలేదు. ఇప్పటికే విద్యార్థులకు ఒక్క జత యూనిఫామ్‌కు పరిమితం చేసిన విద్యాశాఖ అధికా రులు, తాజాగా ఇచ్చిన పుస్తకాలను వెనక్కి తీసుకోవడంపై విమర్శ లు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల అనాలోచిత నిర్ణయాల వల్ల పుస్తకాలు లేకుండానే నూతన విద్యాసంవత్సరం ప్రారంభమవుతోంది. ఎస్సీఈఆర్టీ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్ చేశారు.






