calender_icon.png 15 October, 2025 | 10:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

తక్షకుడు యాక్షన్

14-10-2025 12:00:00 AM

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా ‘తక్షకుడు’. ఇంటెన్స్ యాక్ష న్ డ్రామా కథతో దర్శకుడు వినోద్ అనంతోజు ఈ చిత్రాన్ని రూపొందించారు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో నితాన్షీ గోయెల్ కథానాయికగా నటిస్తోంది. అయితే, ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి రానుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేస్తున్నట్టు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్‌మీడియాలో పంచుకున్న అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో ‘వేటగాడి చరిత్రలో జింక పిల్లలే నేరస్థులు’ అనే ట్యాగ్‌లైన్ ఆకట్టుకుంటోంది. హీరో ఆనంద్ దేవరకొండ చేతిలో తుపాకీ పట్టుకుని ఉండటం, ఒక ఊరు అగ్నికి ఆహుతి అవుతున్నట్టున్న ఈ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.