14-10-2025 12:00:00 AM
అగ్ర నటుడు చిరంజీవిని సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ స్ట్రేలియా నుంచి వచ్చిన తన మనవరాలు ఐరా ఆశీష్ కోరిక మేరకు రామచంద్రరావు తన కుటుంబసభ్యులతో కలిసి మెగాస్టార్‌ను ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ షూటింగ్ స్పాట్‌లో కలుసుకున్నారు. ఈ విషయాన్ని రామచంద్రరావు స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు.
“ఆస్ట్రేలియాలో నివసిస్తున్న నా మనుమరాలు ఐరా ఆశిష్ కోరిక మేరకు మా కుటుంబ సభ్యులతో కలిసి చిరంజీవి, నయనతారను ఈరోజు షూటింగ్ స్పాట్‌లో మర్యాదపూర్వకంగా కలిశాం. ఈ సందర్భంగా సినీ విశేషాలు, సమకాలీన రాజకీయాలు, ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి అనేక ఆలోచనలు పంచుకున్నాం. ఇంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మాకు ఆత్మీయంగా సమయం కేటాయించిన చిరంజీవికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సమావేశం మా కుటుంబానికి మరపురాని ఆనంద క్షణంగా నిలిచింది” అని పేర్కొన్నారు.