calender_icon.png 13 August, 2025 | 7:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దర్గాలో హిందూ పూజారి!

10-08-2025 12:22:16 AM

దర్గాల్లో ముస్లిం ముజావర్ (పూజారి) గా ఉండడం సర్వసాధారణం. అయి తే ఇందుకు భిన్నంగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం దర్గాలో హిందూ మతానికి చెంది న వ్యక్తి పూజారి (ముజావర్)గా బాధ్యతలు నిర్వహించడం ప్రత్యేకతగా నిలుస్తోంది. మహబూబాబాద్ జిల్లాలో ప్రాముఖ్యత గల దర్గా గా పేరుగాంచిన కేసముద్రం జాన్‌పాక్ అమీరుద్దీన్ బాబా దర్గాలో కొంతం మనోహర్ 30 ఏళ్లకు పైగా ముజావర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

దర్గాకు అటు ముస్లింలు, ఇటు హిందువులు నిత్యం వందలమంది దర్శించుకుంటారు. దర్గాకు వచ్చి తమ కోరికలను నెరవేర్చాలని, ఇంకొందరు సంతాన ప్రాప్తి కోసం, మరికొందరు వివిధ రకాల జబ్బులు నయం కావాలంటూ దర్గాకు వచ్చి ప్రణమిల్లుతారు. కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మిక. ప్రతి శుక్రవారం దర్గాకు మహబూబాబాద్ జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా పెద్దఎత్తున భక్తులు వస్తారు. అలాగే ప్రతి ఏటా ఇక్కడ ఉర్సు వేడుకలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం గ్రామానికి చెందిన ప్రజలు తరతర భేదాలు లేకుండా వేడుకలో పాల్గొనడం విశేషం. 

వారసత్వంగా పూజలు

ఈ దర్గాలో అటు ముస్లిం వ్యక్తి, ఇటు హిం దువైన మనోహర్ ముజావర్ (పూజారి)గా విధులు నిర్వహించడం విశేషం. మనోహర్ తాత కొంతం రామచంద్రయ్య తొలుత దర్గా లో ముజావర్‌గా పూజలు నిర్వహించగా, ఆ యన వారసత్వంగా ప్రస్తుతం మనోహర్ ము జావర్‌గా దర్గాలో పూజలు నిర్వహిస్తున్నారు.

భక్తులకు దర్గాలో నిర్వహించే అన్ని కార్యక్రమాలను మనోహర్ నిర్వహిస్తూ హిందూ, ముస్లిం ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తున్నారు. దర్గాలో అటు హిందూ, ఇటు ముస్లిం వ్యక్తి ఇద్దరూ కలిసి ముజావర్‌గా విధులు నిర్వహిస్తున్న కేసముద్రం జాన్ పాక్ అమీరుద్దీన్ బాబా దర్గా ప్రత్యేకతగా నిలుస్తోంది.