calender_icon.png 6 January, 2026 | 9:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోడిపందాల స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

03-01-2026 10:26:12 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ నగర్ శివార్లలో కోడిపందాల స్థావరంపై శనివారం జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి 9 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.విశ్వసనీయ సమాచారంతో కోడిపందాల స్థావరంపై దాడి చేసి నిందితుల వద్ద నుండి రూ 17 వేలు నగదు,8 సెల్ ఫోన్లు,8 బైకులతో పాటు పందాలకు ఉపయోగించిన ఏడు కోళ్లను,12 కత్తులను స్వాదీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రమాకాంత్ తెలిపారు.

పట్టుబడిన నిందితులను బూర్గంపాడు పోలీసులకు అప్పగించి వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే డయల్ 100 కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు.జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణా,పేకాట,కోడిపందాలు,బెట్టింగులు వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ప్రవీణ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.