23-07-2025 12:00:00 AM
ముస్తాబాద్ జూలై 22 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా లైసెన్స్ లేకుండా పేలుడు పదార్థాలు నిల్వ ఉంచిన, రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.పేలుడు పదార్థాలపై జిల్లా టాస్క్ ఫోర్స్, ము స్తాబాద్ పోలీసులు దాడులు నిర్వహించి పలు పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ముస్తాబాద్ ఎస్త్స్ర సిహెచ్ గణేష్ మాట్లాడుతూ నిందితులు గడిపర్తి శ్రీనివాసరావు నిజామాబాద్, ఓర్సు సాయి మల్లు, నందిపేట,నిజామాబాద్, శివరాత్రి రాజు నామపూర్ కు చెందినవారని తెలిపారు. నిజామాబాద్ జిల్లా నందిపేట గ్రామానికి చెందిన గడిపర్తి శ్రీనివాసరావు అనే వ్యక్తి తన యజమాని ఓర్సు సాయి మల్లు ఆదేశాల మేరకు తేదీ 21 జూలై 2025 రో జున రాత్రి తన టాటా వాహనంలో ఎలాంటి అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలను తీసుకవచ్చి ముస్తాబాద్ మండలం నామపూర్ గ్రామంలోని శివరాత్రి రాజు అనే వ్యక్తికి బండ పనుల నిమిత్తం అమ్ముతుండగా నమ్మదగిన సమాచారం మేరకు జిల్లా టాస్క్ఫోర్స్ సి.ఐ నటేష్, ముస్తాబాద్ ఎస్.ఐ గణేష్ ఆధ్వర్యంలో దాడులు చేసి వారి వద్దనుండి పేలుడు పదార్దాలు ఐడల్ పవర్ గెలటిన్ స్టిక్స్ 2600,ఐడియల్ బూస్టర్ జెలటిన్ స్టిక్స్ 405,6000 మీటర్ల ఐడియల్ కార్డెక్స్ వైర్ , డిటోనేటర్ 175 మరియు టాటా యోధా వాహనం నెం. TS-16-UC-2772 స్వాధీనం చేసుకొని శ్రీనివాసరావు, శివరాత్రి రాజు, ఓర్సు సాయి మల్లు అనే ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగిందని తెలిపారు.
ఎవరు కూడా ప్రజా నివాస ప్రాంతాల్లో ఎ లాంటి లైసెన్స్ లేకుండా జెలాటిన్ స్టిక్స్ కానీ పేలుడు పదార్ధాలు నిల్వ ఉంచుతే కఠిన చర్యలు తీసుకోవడంజరుగుతుందని హెచ్చరించారు. జెలాటిన్ స్టిక్స్ కానీ పేలుడు పదార్ధాలు ఎవరైనా వినియెగించాలనుకుంటే దానికి సబంధిచిన అనుమతి లైసెన్స్ తప్పని సరిగా తీసుకోవాలనిసూచించారు.