23-07-2025 12:00:00 AM
అశ్వాపురం, జులై 22,(విజయ క్రాంతి): మండలంలోని నెల్లిపాక బంజర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 1986- 87 పూర్వ విద్యార్థులు మంగళవారం రూ 42,500 విలువగల కంప్యూటర్, ప్రింటర్ వితరణ చేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ చదువుకున్న పాఠశాలకు సేవ చేయాలనే తలంపుతో కంప్యూటర్ వితరణ చేసినట్లు తెలిపారు. విద్యార్థులు విద్యను అభ్యసించి, పాఠశాలకు, తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.
మీరు కూడా ఉన్నత స్థాయికి చేరిన తర్వాత చదువుకున్న పాఠశాలకు సేవ చేయాలన్నారు పాఠశాలలో ప్రస్తుతం చదువుతున్న పిల్లల చదువుల కొరకై అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పంపన మధు, కుందూరు శ్రీనివాస్ రెడ్డి , మిట్టకంటి వెంకటరెడ్డి, రామకృష్ణారెడ్డి, ఓబిలినేని మురళీకృష్ణ, ఎంపల్ల సిద్ధారెడ్డి, అమరపూరి శారద, చావ రమాకుమారి, తాళ్లూరి సత్యనారాయణ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు శంకర్రావు, వీధుల రాంబాబు, శ్రీనివాసరావు, రవికుమార్, మున్నాలాల్, మంగయ్య, మూర్తి, జ్యోతి, కిరణ్, తదితరులుపాల్గొన్నారు.