calender_icon.png 10 October, 2025 | 8:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అనుభవం ఎదురవుతుంది

10-10-2025 12:47:20 AM

ప్రియదర్శి, నిహారిక ఎన్‌ఎం జంటగా నటించిన చిత్రం ‘మిత్ర మం డలి’. విజయేందర్ దర్శకుడిగా బీవీవర్క్స్ బ్యానర్‌పై బన్నీవాస్ సమర్పణలో కళ్యాణ్ మంథిన, భానుప్రతాప, డాక్టర్ విజేం దర్‌రెడ్డి తీగల నిర్మించారు. ఈ చిత్రం అక్టోబర్ 16న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో హీరోయిన్ నిహారిక మీడియాతో ముచ్చటిం చారు. “నేను ముందు ‘మిత్ర మండలి’ కథే విన్నాను. కానీ తమిళ చిత్రం ‘పెరుసు’ ముందుగా విడుదలైంది.

ఈ సినిమాలో ఉండే భారీ క్యాస్టింగ్ వల్ల అందరి డేట్స్ అడ్జస్ట్ కావడానికి చాలా టైమ్ పట్టింది. ఈ సినిమా కథ, కథనం చాలా కొత్తగా ఉంటుంది. థియేటర్‌కు వచ్చిన ప్రతి ఒక్కరినీ హాయిగా నవ్వించేస్తుంది. ఈ చిత్రంలో నేను ఓ సాఫ్ట్ పాత్రను పోషించాను. చాలా కొత్తగా ఉంటుంది. ఇన్‌ఫ్లూయెన్సర్‌గా నాకు చాలా కంఫర్ట్ ఉంటుంది. సినిమాల్లో నటించడం చాలా కొత్తగా, ఆనందంగా ఉంది. నాకు అన్ని కూడా కామెడీ బేస్డ్ చిత్రాలే వస్తున్నాయి.

అందుకే డిఫరెంట్ సబ్జెక్ట్‌లను ఎంచుకోవాలని చూస్తున్నా. కామెడీ ప్రధాన చిత్రాలకే ప్రాధాన్యమిస్తున్నా. ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అనుభవం ఎదురవుతుంది. బయట ప్రపంచంలో ఇండస్ట్రీ గురించి మాత్రం రకరకాలుగా మాట్లాడుకుంటారు. మన హద్దుల్లో మనం ఉంటే ఏమీ కాదు. తెరపై నన్ను మా ఫ్యామిలీ హాయిగా చూసుకునేలా ఉండాలి. నా సీన్ వస్తుంటే వాళ్లు కళ్లు మూసుకునేలా ఉండకూడదు” అని తెలిపింది.