28-08-2025 04:50:20 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు జీఎస్సార్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ వరద తాకిడికి అతలాకుతలం కావడంతో భారీ నష్టం వాటిల్లడంతో గురువారం సాయంత్రం రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka), జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ షెట్కార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీలు పరిశీలించారు. బాధితులను కలిసి ఓదార్చారు. లోతట్టు ప్రాంతాల ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించాలని తెలిపారు. బాధితుల కుటుంబాలకు మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పండ్లరాజు, మాజీ సీడీసీ చైర్మన్ కారంగుల అశోక్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.