calender_icon.png 17 September, 2025 | 12:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీమిండియాదే పైచేయి

30-06-2024 01:35:33 AM

 చెన్నై: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. మారినే కాప్ (125 బంతుల్లో 69 నాటౌట్; 8 ఫోర్లు), నాదినే క్లెర్క్ ( 28 బంతుల్లో 27 నాటౌట్; 5 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా 3 వికెట్లు తీయగా.. దీప్తి శర్మ ఒక వికెట్ పడగొట్టింది. చేతిలో 6 వికెట్లు ఉన్న సఫారీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 367 పరుగులు వెనుకబడి ఉంది. సునే లుస్ (164 బంతుల్లో 65; 6 ఫోర్లు, 1 సిక్సర్) అర్థశతకంతో రాణించగా.. కెప్టెన్ లారా వోల్వర్ట్ (20), అన్నెకె బోస్క్ (39) పర్వాలేదనిపించారు.

అంతకముందు ఓవర్‌నైట్ స్కోరు 525/4తో రెండో రోజు ఆట కొనసాగించిన టీమిండియా రికార్డు స్థాయిలో 603/6 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ (115 బంతుల్లో 69; 4 ఫోర్లు), రిచా ఘొష్ (90 బంతుల్లో 86; 16 ఫోర్లు) అర్థశతకాలతో రాణించారు. అర్థసెంచరీ అనంతరం హర్మన్ వెనుదిరిగినప్పటికీ రిచా సెంచరీ దిశగా పయనించింది. అయితే 86 పరుగుల వద్ద లాబా బౌలింగ్‌లో పెవిలియన్ చేరడంతో టీమిండియా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో డెల్మీ టక్కర్ 2 వికెట్లు పడగొట్టగా.. క్లెర్క్, లాబాలు చెరొక వికెట్ తీశారు. తొలి రోజు ఆటలో షఫాలీ వర్మ డబుల్ సెంచరీ.. మంధన సెంచరీతో కదం తొక్కిన సంగతి తెలిసిందే.  పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుండడంతో మూడో రోజు ఆటకు కీలకం కానుంది.