30-06-2024 01:39:59 AM
కీలక పోరులో మరోసారి భారత బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. రోహిత్ శర్మ, రిషబ్ పంత్, సూర్యకుమార్ విఫలమవడంతో.. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఓ మాదిరి స్కోరుకే పరిమితం కావాల్సి వచ్చింది. ఒక ఎండ్‌లో కోహ్లీ నిలబడినప్పటికీ మరో ఎండ్‌లో చూస్తుండగానే రోహిత్, పంత్, సూర్య కుమార్‌లు విఫలమై తక్కువ స్కోర్లకే పెవిలియన్ బాట పట్టారు. 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి టీమిండియా పీకల్లోతూ కష్టాల్లో పడినట్లు అనిపించింది. ఈ దశలో శివమ్ దూబే క్రీజులోకి వస్తాడని అంతా భావించారు. కానీ ఇక్కడే హిట్‌మ్యాన్ తన బుర్రను వాడి ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు బ్యాటింగ్‌లో ప్రమోషన్ ఇచ్చి ఐదో స్థానంలో పంపాడు.
కెప్టెన్ నమ్మకాన్ని నిజం చేస్తూ అక్షర్ ఆపద్భాందవుడి పాత్రను పోషించాడు. కోహ్లీ స్ట్రుక్ రొటేట్ చేయడంతో అక్షర్ పటేల్ యథేచ్చగా బ్యాట్‌ను ఝలిపించాడు. వచ్చీ రావడంతోనే బౌండరీ బాదిన అక్షర్ ఆ తర్వాత షంసీ, రబాడ, మార్కరమ్ బౌలింగ్‌లో కళ్లు చెదిరే సిక్సర్లు కొట్టి అభిమానులను అలరించాడు. దురదృష్టవశాత్తూ రనౌట్‌గా వెనుదిరిగినప్పటికీ అక్షర్ ఉన్నంతసేపు ధాటిగా ఆడి టీమిండియా గౌరవ ప్రదమైన స్కోరు సాధించడానికి బాటలు వేశాడు. టీ20 ప్రపంచకప్‌కు ముందు అక్షర్‌పై పెద్దగా ఎవరికి అంచనాలు లేవు. స్పిన్ ఆల్‌రౌండర్‌ను ఎందుకు ఆడిపిస్తున్నారన్న విమర్శలే ఎక్కువగా వచ్చాయి. కానీ మెగాటోర్నీ ఆరంభమయ్యాకా అందరి అంచనా లను తలకిందులు చేస్తూ అక్షర్ పటేల్ అటు బ్యాట్‌తో.. ఇటు బంతితో రాణించాడు.