calender_icon.png 15 September, 2025 | 6:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్వార్టర్స్‌లో సింధు

29-11-2024 12:00:00 AM

  1. లక్ష్యసేన్, ఆయుశ్ శెట్టి ముందంజ
  2. మాళవిక, కిరణ్ జార్జికి షాక్
  3. సయ్యద్ మోదీ బ్యాడ్మింటన్ టోర్నీ

లక్నో: ప్రతిష్ఠాత్మక సయ్యద్ మోదీ బ్యాడ్మింటన్ టోర్నీలో తెలుగు తేజం పీవీ సింధు జోరు కొనసాగిస్తోంది. మహిళల సిం గిల్స్‌లో భారత స్టార్ షట్లర్ క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. గురువారం జరిగిన రెండో రౌండ్‌లో సింధూ 21-10, 12-21, 21-15 తో  సహచర క్రీడాకారిణి ఇరా శర్మపై విజయం సాధించింది.

49 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌ను తొందరగానే ముగించిన సింధూకు రెండో గేమ్‌లో మాత్రం ఇరా శర్మ గట్టి పోటీనిచ్చింది. సింధూపై గెలిచి రెండో గేమ్‌ను సొంతం చేసుకున్న ఇరా మూడో గేమ్‌లోనూ అదే జోరు చూ పించింది. ఒక దశలో సింధూ 2-12తో వెనుకబడడంతో ఓటమి దిశగా సాగింది.

అయితే తన అనుభవాన్ని అంతా రంగరించిన సింధూ ఇరాను ఓడించి గేమ్‌తో పా టు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఇక క్వార్టర్స్‌లో సింధూ చైనా షట్లర్ డాయ్ వాంగ్‌ను ఎదుర్కోనుంది. మిగిలిన సింగిల్స్ మ్యాచ్‌ల విషయా నికి వస్తే ఉన్నతి హుడా 21-18, 22-20తో పోర్న్‌పించా (థాయ్‌లాండ్)పై, తన్సిమ్ మిర్ 21-15, 13-21, 21-7తో సహచర షట్లర్ అనుపమపై విజయం సాధించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు.

అయి తే  మధ్య కాలంలో సూ పర్ ఫామ్‌లో ఉన్న మా ళవిక బన్సోద్‌కు చుక్కెదురైంది. రెండో రౌండ్‌లో బన్సోద్ 12-21, 15-21 తో భారత్‌కే చెందిన శ్రియాన్షి వలిశెట్టి చేతిలో ఓటమి చవిచూసింది.

లక్ష్యసేన్ జోరు..

పురుషుల సింగిల్స్‌లో భారత టాప్ షట్లర్ లక్ష్యసేన్ క్వార్టర్స్‌కు దూ సుకెళ్లాడు. రెండో రౌండ్ మ్యాచ్‌లో లక్ష్యసేన్ 21-14, 21-13తో ఇజ్రాయెల్‌కు చెందిన డానిల్ డుబొ వెంకోను రెండు గేముల్లోనే ఓడించాడు. కేవలం 35 నిమిషాల్లోనే మ్యా చ్ ముగియడం గమనార్హం. క్వార్టర్స్‌లో లక్ష్యసేన్ మన దేశానికే చెందిన మెయిరబా లువాంగ్‌ను ఎదుర్కోనున్నాడు.

మిగిలిన మ్యా చ్‌ల్లో ఆయుశ్ శెట్టి 21-12, 21-19తో మలేషియాకు చెందిన హో జస్టిన్‌పై, ప్రియాన్షు రజావత్ 21-15, 21-8తో లి డుక్ (వియత్నాం)పై విజయాలు సాధించి ముందంజ వేయగా.. కిరణ్ జార్జి మాత్రం ఓటమి పాలయ్యాడు. మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపిచంద్-త్రిసా జాలీ జంట 21-13, 21-10తో భారత్‌కు చెందిన అశ్విని-శిఖా గౌతమ్‌పై విజయం సాధించి క్వార్టర్స్ చేరుకున్నారు.

రుతుపర్ణ జోడీతో పాటు ప్రియా-శృతి మిశ్రా ముందంజ వేశారు. పురుషుల డబుల్స్‌లో ఇషాన్ జోడీ, ప్రకాశ్ రాజ్ , పృథ్వీ క్రిష్ణమూర్తి ద్వయం క్వార్టర్స్ చేరుకున్నారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో సతీశ్ కుమార్-ఆద్య వరియత్ ముందంజ వేయగా.. హైదరాబాదీ ద్వయం సుమిత్-సిక్కిరెడ్డి ఓటమి పాలయ్యారు.