03-10-2024 06:15:22 PM
మందమర్రి,(విజయక్రాంతి): ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతున్న పట్టణంలోని శాంతినగర్ కు చెందిన సునార్కర్ మల్లేష్ కు టీం పంచముఖి స్వచ్ఛత సంస్థ సభ్యులు అండగా నిలిచారు. పట్టణ వాస్తవ్యులు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంటున్న టీం పంచముఖీ స్వచ్ఛంద సంస్థ సభ్యులు శరత్ రెడ్డి గురువారం ఆపన్న హస్తం అందించారు. రెండు నెలలకు సంబంధించిన నిత్యావసర వస్తువులను పట్టణంలోని శ బాధితుని నివాసంలో అందజేశారు.ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ గతంలో మల్లేష్ కు వీల్ చైర్ అందించినట్లు తెలిపారు. మల్లేష్ కోలుకునేంతవరకు తమ సంస్థ సహకారం ఉంటుందని బాధిత కుటుంబానికి భరోసా నిచ్చారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు పాల్గొన్నారు.