14-12-2025 12:00:00 AM
విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ దాసేశ్వరరావు
హైదరాబాద్, డిసెంబర్ 13 (విజయక్రాంతి): ప్రస్తుత పోటీ ప్రపంచంలో అద్భు తమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే, విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వరరావు పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దేశ్ముఖి గ్రామంలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో శనివారం ‘ఇగ్నైట్ యువర్ కోడింగ్ జర్నీ’ పేరు తో కోడింగ్ పోటీలను నిర్వహించారు.
ప్రొ ఫెసర్ వైవీ దాసేశ్వరరావు మాట్లాడుతూ సాఫ్ట్వేర్ రంగంలో రాణించాలంటే కేవలం పుస్తక జ్ఞానం సరిపోదని, ప్రాక్టికల్ నైపు ణ్యం అవసరమని చెప్పారు. నేటి సాంకేతిక యుగంలో కోడింగ్ ప్రాధాన్యతను వివరి స్తూ, విద్యార్థుల సృజనాత్మకత ను వెలికితీసేందుకు ఇటువంటి కోడింగ్ పోటీలు ఎంత గానో దోహదపడతాయన్నారు. కోడింగ్ పోటీలో విద్యార్థులు సంక్లిష్టమైన సమస్యల కు కోడింగ్ ద్వారా పరిష్కారాలను కనుగొన్నారు.
ప్రతిభ కనబరిచిన విద్యార్థుల కోసం 10 ఆకర్షణీయమైన బహుమతులను ప్రకటించారు. యూనివర్సిటీలో బీటెక్ -సీఎస్‌ఈ సెకండియర్ చదువుతోన్న బి.శ్రవణ్ కుమా ర్ అద్భత ప్రతిభ కనబరిచారు. కేవలం తరగతి గది విద్యకే పరిమితం కాకుండా, రియల్- టైమ్ సమస్యలకు పరిష్కారం చూపుతూ శ్రవణ్ రెండు కీలకమైన వ్బుసైట్లను రూపొందించాడు. విద్యార్థులు, సిబ్బందికి సౌకర్యవంతంగా ఉండేలా ‘కాలేజీ క్యాంటీన్‘ వ్బుసై ట్ను డిజైన్ చేశారు.
యూనివర్సిటీలో జరిగే వివిధ కార్యక్రమాల సమాచారాన్ని, రిజిస్ట్రేషన్ల ను సులభతరం చేసేలా ‘ఈవెంట్ మేనే జ్మెంట్‘ వ్బుసైట్ను డిజైన్ చేశాడు. ఫ్యాకల్టీ(టీఏ) కె.ప్రణవ్ రెడ్డి సహకారంతో డెవలప్ చేసిన ఈ వ్బుసైట్లను ప్రొఫెసర్ దాసేశ్వరావు ఆవిష్కరించారు. శ్రవణ్‌కుమార్‌ను ప్రొఫెసర్‌పాటు అధ్యాపకులు అభినందించారు.