calender_icon.png 14 December, 2025 | 4:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చాంపియన్స్‌గా క్రెడికాన్ మావెరిక్స్

14-12-2025 12:00:00 AM

హైదరాబాద్ పికిల్‌బాల్ లీగ్ 

హైదరాబాద్, డిసెంబర్ 13 : హైదరాబాద్ పికిల్‌బాల్ లీగ్ తొలి సీజన్‌లో క్రెడికా న్ మావెరిక్స్ విజేతగా నిలిచింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లోని ది లీగ్ వేదికగా జరిగిన ఫైనల్లో ఆల్ స్టార్స్ జట్టుపై క్రెడికాన్ మావెరిక్స్ విజయం సాధించింది. ఆద్యంతం ఉ త్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో మావెరిక్స్ 4-3 స్కోర్ తేడాతో గెలుపొందింది. గత కొంతకాలంగా ఆదరణపెరుగుతూ వస్తు న్న నేపథ్యంలో హైదరాబాద్ పికిల్‌బాల్ లీగ్‌ను నిర్వహించారు.

ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు దాదాపు 2 వేలమందికి పైగా అభి మానులు తరలివచ్చారు. విజేతగా నిలిచిన క్రెడికాన్ మావెరిక్స్ జట్టుకు ట్రోఫీతో పాటు రూ.6 లక్షల నగదు బహుమతి దక్కింది. రన్నరప్‌గా నిలిచిన ఆల్‌స్టార్స్ జట్టు రూ.3 లక్షల నగదు బహుమతి అందుకుంది. ఆల్ స్టార్స్ జట్టు ప్లేయర్ సమీర్ వర్మ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డును గెలుచుకున్నాడు. 

ఫైనల్ మ్యాచ్ సందర్భంగా సింగల్ లక్కీ అలీ టీమ్ మ్యూజికల్ వైట్ అలరించిం ది. హైదరాబాద్ పికిల్‌బాల్ లీగ్ తొలి సీజన్‌ను విజయవంతంగా ముగియడంపై సెం టర్ కోర్ట్ స్పోర్ట్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్, లీగ్ కో ఫౌండర్ యశ్వంత్ బియ్యాల సంతో షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో మరి న్ని టోర్నీలు నిర్వహిస్తామని తెలిపారు.