23-10-2025 06:27:25 PM
నిర్మల్ రూరల్: పట్టణంలోని వాసవి స్పేస్ స్కూల్ లో చదువుతున్న చిన్నారి ఆరాధ్య లక్ష్మి స్టార్ కిడ్ 2025 కేటగిరిలో ప్రతిభను చాటినట్టు నిర్వాహకులు తెలిపారు. వైద్యుడు అల్లాడిస్ మైండ్ క్లినిక్ డాక్టర్ అల్లాడి సురేష్ ఏకైక కుమార్తె ఆరాధ్య లక్ష్మి(7), 2వ తరగతి వాసవి వరల్డ్ స్కూల్ లో చదువుతుంది. ఈ పాప ప్రైడ్ ఆఫ్ తెలంగాణ-2025 స్టార్ కిడ్ క్యాటగిరిలో చిన్నతనంలోనే కూచిపూడి నృత్యంలో మంచి ప్రతిభ కనబరిచి గెలుపొందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మహిళ సంఘం వాళ్ళు వాసవి వరల్డ్ స్కూల్ కు వెళ్ళి ఈరోజు అల్లాడి ఆరాధ్య లక్ష్మిని సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం చైర్ పర్సన్ నిర్మల ప్రెసిడెంట్ కరిపే వనమాల,కోశాధికారి కుంభాజి రాణి,సభ్యులు శాంతి, వాల్గోజి శాంతాబాయి, స్కూల్ సెక్రటరీ జగదీష్ రెడ్డి,ప్రిన్సిపాల్ శైల జాయ్సన్ లు తదితరులు పాల్గొన్నారు.